Mahaa Daily Exclusive

  రాష్ట్ర బిజెపి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం అట్టహాసంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుని ప్రమాణస్వీకారం అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రులు బిజెపి రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రారావు ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

జిల్లాలోని తుర్కయంజాల్ పరిధిలోని వేద కన్వెన్షన్ లో అట్టహాసంగా బిజెపి రాష్ట్ర నూతన అధ్యక్షుని ప్రమాణస్వీకారం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షునిగా ఎన్ రామచంద్రరావును బిజెపి కేంద్ర నాయకత్వం నియమించడం జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో వేద కన్వెన్షన్ లో, జిల్లా బిజెపి అధ్యక్షులు రాజు భూపాల్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన, బిజెపి నూతన అధ్యక్షుని ప్రమాణస్వీకార కార్యక్రమానికి, కేంద్ర మంత్రులు గంగాపురం కిషన్, బండి సంజయ్, ఎంపీలు గల్లా అరుణకుమారి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, మాజీ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బిజెపి ప్రముఖులు హాజరైన వారి సమక్షంలో రాష్ట్ర నూతన అధ్యక్షునిగా ఎన్ రామచంద్రరావుతో ప్రమాణస్వీకారం చేయించారు. బిజెపి రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర నేతలు పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర నాయకత్వం నాపై నమ్మకంతో ఇంతటి మహోన్నతమైన బాధ్యతను అప్పజెప్పడం జరిగిందని, నాపై నమ్మకం ఉంచి బిజెపి రాష్ట్ర బాధ్యతలు ఇచ్చినందుకు తన వంతు కృషి చేస్తానని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి రాష్ట్రస్థాయి నాయకుడి నుంచి మండల స్థాయి కార్యకర్త వరకు కలుపుకొని, తన బాధ్యతను నిర్వర్తిస్తానని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పార్టీని పటిష్టం చేసి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జెండా ఎగురవేయడం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలు ఆ రెండు పార్టీలతో విసిగిపోయారు….
తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలతో విసిగి వేసారి పోయారని, కేంద్రంలో మోదీ చేస్తున్న పాలనను రాష్ట్రంలోనూ ప్రజలు కోరుకుంటున్నారని, ఆ దిశగా పటిష్టమైన కృషిచేసి రాష్ట్రంలో బిజెపి జెండా ఎగరవేస్తామని కార్యకర్తలను నూతన ఉత్సాహాన్ని నింపారు. క్షేత్రస్థాయి నుండి బిజెపి పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి మాటలు ఎక్కువ పని తక్కువ…
ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పై పూర్తి వ్యతిరేకత వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి మాటలు ఎక్కువ పని తక్కువ అంటూ, మాటలతో రాష్ట్ర ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని, నేడు గల్లాలో చిల్లి గవ్వ లేదు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో కాలం చెల్లిందని ఆయన హితవు పలికారు.

సోషల్ మీడియా పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి….
సోషల్ మీడియా పట్ల బిజెపి కార్యకర్తలు నాయకులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు సూచించారు. బిఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని, అప్పుల కుప్పగా మార్చి ఇవాళ పేద ప్రజల స్థితిగతులను దిగజార్చిందని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో బిజెపి ప్రభుత్వంపై, మోడీ నాయకత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తూ, బిజెపి కార్యకర్తలను ఆందోళన గురి చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కార్యకర్తలు ఇలాంటి సోషల్ మీడియాలో వచ్చే వదంతువులను చూసి ఆందోళన చెందవదని, ధైర్యంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్, జిల్లా మాజీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, నోముల దయానంద్ గౌడ్, రాష్ట్ర బిజెపి క్రమశిక్షణ కమిటీ సభ్యులు బోసు పల్లి ప్రతాప్, పోరెడ్డి అర్జున్ రెడ్డి, బిజెపి పార్టీ ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Latest