Mahaa Daily Exclusive

  కాల్వవోడ్డు మున్నేరు వద్ద నీటి ప్రవాహం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్ళింపు: ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్

Share

ఖమ్మం, మహా.
ఖమ్మం నగరంలోని కాల్వవోడ్డు నుండి నాయుడు పేట మున్నేరు వంతెన వద్ద వున్న చాప్టా రోడ్డు పై ఉదయం నుండి వరద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు నిలిపివేయడం జరిగిందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలైన ప్రకాష్ నగర్, కరుణగిరి వంతెన మీదుగా ప్రయాణం కొనసాగించాలని ట్రాఫిక్ ఇనస్పెక్టర్ బెల్లం సత్యనారాయణ తెలిపారు.

కాల్వవోడ్డు మున్నేరు చాప్టా పై
వరద నీరు తగ్గిన వెంటనే తిరిగి ట్రాఫిక్ పునరుద్ధరించడం జరుగుతుందని తెలిపారు.

అప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

Latest