మధిర జూలై 1 మహా
అంతర్జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా కెవిఆర్ హాస్పిటల్ అధినేత, ప్రముఖ వైద్యులు డాక్టర్ కోట రాంబాబు ను MEF నాయకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధిరలో అనేక సంవత్సరాల నుండి అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తూ అందరి మన్నలను పొందిన వ్యక్తిగా డా. కోట రాంబాబు పేరొందారు అని కొనియాడారు. వారు ఇంకా మధిర మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో MEF నాయకులు కోట జయరాజు, వడ్లమూడి వెంకటేశ్వరరావు, భాస్కరరావు, సరిమల్ల నవీన్, మోదుగు సైదులు, ప్రపుల్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 150








