Mahaa Daily Exclusive

  అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

Share

మంచిర్యాల, మహా : ఆదివాసీలు, ఇతరులు అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మంచిర్యాల డి.సి.పి. ఎ భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఎ.సి.పి.లు ప్రకాష్, రవికుమార్, వెంకటేశ్వర్లు, తహశిల్దార్లు, అటవీ శాఖ రేంజ్ అధికారులతో అటవీ భూముల ఆక్రమణల నిరోధంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలో అటవీ భూములను ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆక్రమణదారులను నిర్మూలించేందుకు పోలీసులు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అటవీ చట్టాలను ఉల్లంఘించి అటవీ భూముల ఆక్రమణ ఎవరైనా పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.