మందమర్రి, మహా : ఒర్రెగడ్డ ప్రభుత్వ బాలుర పాఠశాలలోని
విద్యార్థులకు సోమవారం లింగయ్య స్వచ్ఛంద సంస్థ
నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, ఎంఈఓ దత్తు ప్రసాద్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు
దివంగత అసోసియేట్ లింగయ్య స్వచ్ఛంద సంస్థ నోట్ పుస్తకాలు, పెన్నులను అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజశేఖర్, పాఠశాల హెచ్ఎం పద్మజ, స్వచ్ఛంద సంస్థ సభ్యులు గజ్జల రామ్ చందర్, రామ్ వెంకటేశ్వర్లు, చిలుముల శ్రీనివాస్, గుడ్ల రమేష్, మద్దెల విజయ్, బీమ్ పుత్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 90







