TG: రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రారంభించబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. అసలైన అభివృద్ధి అంటే హైదరాబాద్‌ను కాదు.. వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం అని మంత్రి తెలిపారు.
Post Views: 57








