వరంగల్ మహా;
వ్యవసాయ రంగంలో నానో యూరియాతో సత్ప్రలితాలు పొందవచ్చని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. సోమవారం వరంగల్ జిల్లా సంగెo మండలం గవిచర్ల గ్రామంలో వ్యవసాయ శాఖ ఇఫ్కో సంయుక్త ఆధ్వర్యంలో నానో యూరియా ప్లస్ మరియు నానో డి ఏ పి పై జరిగిన అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో డ్రోన్ ద్వారా నానో యూరియా ద్వారా పొలాల్లో వేస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నానో యూరియా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నదని ఆన్నారు. రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నానో సాంకేతికత పరిజ్ఞానంతో మొట్టమొదటిసారిగా యూరియాను ద్రవ రూపంలో తీసుకువచ్చిన ఘనత ఓ భారతీయుడిని ఇది దేశానికే గర్వకారణం అన్నారు.
సత్వర ప్రయోజనం అందించే నానో యూరియా గురించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నానో యూరియా వాడకం పై రైతులకు అవగాహన కల్పించుటకు వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. రైతు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి నానో యురియాను ఎలా ఉపయోగించాలో రైతులకు ప్రత్యక్షంగా చూపించాలన్నారు. నానో యూరియా వాడకం వల్ల అధిక దిగుబడి, ఖర్చు తగ్గడం, భూసార పరిరక్షణ, పర్యావరణహితం కలుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, మండల వ్యవసాయ అధికారులు,
ఇఫ్కో ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పోదామా








