కాటారం, మహా:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్లోని మహదేవ పూర్ మండలంలో సోమవారం సబ్ కలెక్టర్ మయాంక్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మహాదేవపూర్ లోని సామాజిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీచేశారు. కాళేశ్వరం లోని సర్వే నెంబర్ 129 లో నూతన బస్టాండ్ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేశారు.
కాళేశ్వరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మహాదేవపూర్ లోని మండల విద్యా వనరుల కేంద్రం సందర్శించారు.మెడికల్ సిబ్బంది, ఉద్యోగుల,ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ లను తనిఖీ చేశారు. అక్కడి మౌలిక సదుపాయలపై విద్యార్థుల హాజరు, ఎస్ ఎస్ సి ఫలితాల పై ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామారావు,డిప్యూటీ తహసిల్దార్ కృష్ణ, ఎం ఈ ఓ పాల్గొన్నారు.
Post Views: 33








