భూపాలపల్లి, మహా :
ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో రెవెన్యూ, టిఎస్ఎండిసి, ఇరిగేషన్, పోలీస్, రవాణా, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, భూగర్భ జల శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందని తెలిపారు.
ఉచిత ఇసుక రవాణాలో అక్రమాలకు తావు లేకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలోని ఇసుక రీచ్ లను గుర్తించి జియో ట్యాగింగ్ చేయాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్న లబ్ధిదారులకు ఇసుకను అందించేందుకు రవాణా జరిగే కిలోమీటర్ల దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలను నిర్ణయించాలని తెలిపారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఇసుక రీచ్ ల అనుమతుల కోసం నివేదికలు అందించాలని అధికారులకు సూచించారు.
అనంతరం మన ఇసుక వాహనం మొబైల్ యాప్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను అధికారులతో కలిసి పరిశీలించి మన ఇసుక వాహనం అనే మొబైల్ యాప్ తీసుకురావడం వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులతో చర్చించారు.
వారం రోజులు మహిళా శక్తి సంబరాలు
మహిళా శక్తి సంబరాలు కార్యక్రమాలు వారం రోజులు పాటు జరపాలని నిర్ణయించారని,
మహిళా శక్తి సంబరాలు మహిళల నైపుణ్యాలను ప్రదర్శించే అద్భుత వేదిక అని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు.
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధనకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం నిర్వహణతో మహిళా సాధికారతకు దోహదపడుతుందని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక మహిళలకు వ్యాపారాలు నిర్వహణ, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. అందులో సెర్ఫ్ ఆద్వర్యంలో ఇప్పటి వరకు మహిళలు సాధించిన ప్రగతి మరియు మహిళా శక్తి కార్యక్రమంలో ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి వివిధ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఫిష్ ఔట్ లెట్, మహిళా శక్తి, బస్సులు, సౌర శక్తి ప్లాట్లు ద్వారా విద్యుత్ సరఫరా, పెట్రోల్ బంకులు, వ్యవసాయ పనిముట్లు, పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్ తయారు, అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతులు మొదలగు కార్యక్రమాలను మహిళల ద్వారా అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళల సాధికారత అన్ని సమావేశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళలను చైతన్యం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్డీఓ బాల కృష్ణ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ముదురుకోళ్ల సరిత,, పాల్గొన్నారు.








