Mahaa Daily Exclusive

  ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అరెస్టులా…? జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు ఇందిరమ్మ ఇండ్లలో కేంద్రం వాటా ఎంత రాష్ట్ర మంత్రి శ్వేత పత్రం విడుదల చేయాలి ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై ప్రశ్నిస్తే పోలీసులచే అరెస్టు చేయిస్తారా అంటూ బిజెపి నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు అన్నారు.
అమ్రాబాద్ మండలం మున్ననూర్ గ్రామానికి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులను అమ్రాబాద్ పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు బయటాయించి ధర్నా చేపట్టారు. బిజెపి నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తే అరెస్టు చేయడం హేమమైన చర్య అని తెలిపారు. రాష్ట్రంలోని పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లలో కేంద్రం, రాష్ట్రం వాటా ఎంతనో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్వేత పత్రం విడుదల చేసి ప్రజలకు తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఇండ్లలో పారదర్శకత ఉండాలని నిరుపేద కుటుంబాలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి అమ్రాబాద్ మండల అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు నోముల శంకర్ గౌడ్, బాత్క అరవింద్ యాదవ్, నోముల అంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Latest