వరంగల్ మహా;
భోజ్యనాయక్ తండ ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పేర్కొన్నారు.
గురువారం నర్సంపేట మండలంలోని బోజ్య నాయక్ తండాలో గతంలో కొన్ని కారణాలవల్ల మూసివేయబడిన
ప్రభుత్వ మండల పరిషత్ పాఠశాలను కలెక్టర్ పునః ప్రారంభించారు. భోజన నాయక్ తండాలో పాఠశాల పునః ప్రారంభానికి కృషి చేసిన బొజ్య నాయక్ తండా వారియర్స్ యువకులు, తండావాసులకు
పాఠశాలలో స్వచ్ఛందంగా తరగతులు నిర్వహిస్తున్న యువకులకు కలెక్టర్ అభినందించారు .
బోజ్యానాయక్ తండలో నూతన ప్రభుత్వ పాఠశాల గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించగా గురువారం జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఉజ్వల
భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి, మెరుగైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థులకు లక్ష్యంతో చదివి భవిష్యత్తులో రాణించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండాలని ఉద్దేశంతో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నదని, నూతన భవనం నిర్మాణం కోసం చర్యలు తీసుంటామని కలెక్టర్ అన్నారు. విద్య అనేది ప్రతి పేదవాడికి చేరాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని,
గ్రామాల అభివృద్ధికి బడి వెలుగు మార్గమని అన్నారు.
గంగాదేవి పల్లి, మరియాపురం గ్రామాలతో పోటీపడి బొజ్జ నాయక్ తండాను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని, అందుకు కావలసిన ప్రణాళికలు రచించినచో ప్రభుత్వం పరంగా సహకారం అందిస్తామన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించి వారికి గణిత శాస్త్రం, ఆంగ్లంలో పలు ప్రశ్నలు వేసి జవాబు రాబట్టారు. విద్యార్థులు ఇష్టపూర్వకంగా చదివి భావి భారత పౌరులుగా కావాలని ఆకాంక్షించారు.
అంతకుముందు కలెక్టర్ విద్యార్థులతో కలసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
అనంతరం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, పలకలు, పెన్నులు, నోట్ బుక్స్ , పెన్సిల్స్ లు దాత నర్సింహరెడ్డితో కలసి అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఎంఈఓ సారయ్య, తహసిల్దార్ రవిచంద్ర రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్, వారియర్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.








