వరంగల్ మహా;
వరంగల్ జిల్లా అధ్యక్షుడు ముష్కమల్ల సుధాకర్
వరంగల్ జిల్లా మున్నూరుకాపు సంఘం బలోపేతానికి కృషి చేస్తానని, నూతనంగా వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎన్నికైన ముష్కమల్ల సుధాకర్ పటేల్ అన్నారు. గురువారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం బలోపేతానికి వరంగల్ జిల్లాలోని అన్ని మండలాల్లో మున్నూరుకాపు సంఘం ఎన్నికలు నిర్వహించి అందరిని ఏకతాటిపైకి తీసుకొస్తానన్నారు. మున్నూరుకాపుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ
సుమారు 11 సంవత్సరాల తర్వాత వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ముష్కమల్ల సుధాకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తనను ఎన్నుకున్నందుకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ పటేల్, మంత్రి కొండా సురేఖకు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపాల నవీన్ రాజు కు సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ పటేల్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. వరంగల్ లో కమ్యూనిటీ హాల్ కు ఎకరం స్థలం ఇచ్చి కట్టించడానికి కృషి చేస్తానన్నారు. త్వరలో మంత్రి సురేఖను కలిసి వినతిపత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కటకం పెంటయ్య, రాష్ట్ర కార్యదర్శి బండి రమేశ్, వలిశెట్టి సుధాకర్, కంచి మనోహర్, బొరిగం భాస్కర్, దొరం ఆనంద్, వానం శ్యామ్, ముష్కమల్ల దేవేందర్, చెర్కులపల్లి సతీష్, గొట్టే వెంకన్న,తోట తిరుమల్, కోల కృష్ణ, గోపు రఘుపతి, మున్నూరు కాపు కుల భాంధవులు తదితరులు పాల్గొన్నారు.








