Mahaa Daily Exclusive

  కాలేశ్వరంలో ప్రాణహిత నది ఉగ్రరూపం గోదావరి నదికి భారీగా పెరుగుతున్న వరద ప్రవాహం నీటిలో మునిగిన పుష్కర ఘాట్లు, జ్ఞానజ్యోతి విగ్రహం..!

Share

కాటారం, మహా : అల్పపీడన ద్రోనీతో మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కాలేశ్వరంలో ప్రాణహిత గోదావరి నది సంఘమ తీరం గోదావరి నదిగా కాలేశ్వరంలో పుష్కర ఘాట్లో అన్ని వరద ప్రవాహంతో మునిగిపోయాయి. సరస్వతీ పుష్కరాల సమయంలో నిర్మించిన సరస్వతీ జ్ఞాన జ్యోతి విగ్రహాలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. బుధ, గురువారాలలో వరద ప్రవాహం అంతకంతకు గోదావరి నదిలో పెరుగుతోంది. గోదావరి నదికి ఎగువన వర్షాలు పడుతున్నప్పటికీ వరద ప్రవాహం లేదు. మానేరు నదిలో కొంత మాత్రమే వరద ప్రవహిస్తోంది. ప్రాణహిత నదికి వరద పోటెత్తడంతో గోదావరి నదిలో వరద బాగా వస్తోంది.కాలేశ్వరం ప్రాజెక్టులలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ లో గురువారం సాయంత్రం 6 గంటలకు 6,65,170 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కాలేశ్వరంలో 10.690 మీటర్ల ఎత్తులో వరద ఉధృతి ఉన్నట్లు సిడబ్ల్యుసి అధికారులు తెలిపారు. 12.210 మీటర్లు వరద ప్రవాహం ఉంటే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతుండడంతో పరివాహక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Latest