రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
తిప్పాయిగూడ గ్రామంలోని ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకి వినతి పత్రం అందించిన, గ్రామ సిపిఎం మండల కమిటీ సభ్యులు ఆవుల యాదయ్య, గ్రామ శాఖ కార్యదర్శి బుర్రి సుధాకర్, నాయకులు. మంచాల మండలం, తిప్పాయిగూడా గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని, కలిసిన గ్రామ సిపిఎం పార్టీ నాయకులు ప్రజా సమస్యలను దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గ్రామంలోని అన్ని వార్డుల్లో కోటి రూపాయల తోటి సిసి రోడ్లు నిర్మిందాలని తెలిపారు. తిప్పాయిగూడ నుండి ముక్కునూరు వరకు రోడ్డును వెంటనే మరమ్మత్తులు చేయాలి. మంచాల మండల కేంద్రం నుండి తిప్పాయిగూడ వరకు ఉన్న బీటీ రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి. గ్రామంలోని పెద్దరోని కుంట, ఇరమోనికుంట, రామాయ చెరువు మరమ్మత్తులు కోసం 30 లక్షల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. రాచకొండ గ్రామ పరిధిలో ఉన్న పోడు భూమి 273 సర్వే నెంబరులో సాగు చేస్తున్న రైతులకు పట్టాలు అందించాలని కోరారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్లు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.








