Mahaa Daily Exclusive

  మీ హయాంలో జరిగిన పనులు, మా హయాంలో జరిగిన అభివృద్ధికి మేం చర్చకు సిద్దమని గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు పోతుల శ్రీమన్, తోట వెంకన్న..!

Share

హన్మకొండ మహా;

మీ హయాంలో జరిగిన పనులు, మా హయాంలో జరిగిన అభివృద్ధికి మేం చర్చకు సిద్దమని గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు పోతుల శ్రీమన్, తోట వెంకన్న, జక్కుల విజయ, బిఆర్ ఎస్ కార్పొరేటర్ల పై ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ రాజాలీ, పోతుల శ్రీమాన్ మాట్లాడుతూ
అమృత్,స్మార్ట్ సిటీ నిధుల అభివృద్ధిలో మీ పాత్ర శూన్యమని
హనుమకొండ జిల్లా రాజకీయాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎంతో హుందాతనంతో సాగిస్తున్నదని గతంలో ప్రశ్నించడమే పాపంగా చూసిన బి అర్ ఎస్ కార్పొరేటర్లు గుర్తుంచుకోవాలని అన్నారు.
హుందా రాజకీయాలు ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు నేర్చుకోవాలని
మీ హయాంలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించిన డివిజన్ లలో అభివృద్ధిని చిన్నచూపు చూడటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
మాజీ ఎమ్మెల్యే హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటో,ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అభివృద్ధి ఏంటో ప్రజలు గమనిస్తున్నారని
చర్చకు మేం అన్ని విధాలుగా సిద్ధం అన్నప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలయాపన ఎందుకని ప్రశ్నించారు.
మీ పదేళ్లలో దేవాదాయ శాఖకు కేటాయించిన నిధులు ఎంత..?
వెనక్కి పోయిన స్మార్ట్ సిటీ నిధులను ముఖ్యమంత్రిని ఒప్పించి వెనక్కి తెచ్చిన నాయకుడు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అని గుర్తు చేశారు.
భద్రకాళి బండ్ ,చెరువు అభివృద్ది ప్రక్రియ ఈ టెండర్ లో భాగంగా జరిగిన విషయం మీకు తెలియకపోవడం బాధాకరమని
కేంద్ర ప్రభుత్వం ఆనాడు దేశ వ్యాప్తంగా వెనకబడిన, హెరిటేజ్ నగరాలను ఎంపిక చేసి నిధులు మంజూరు చేసిందన్నారు.
మంజూరు చేసిన నిధులను కూడా సకాలంలో సద్వినియోగం చేయలేని అసమర్థ పాలన మీదని అన్నారు.
కార్పొరేటర్లుగా మీకు ప్రజలు అవకాశం ఇస్తే ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంతో చర్చించే ఓపిక లేకుండా వెళ్లింది మీరే కదా..?
మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించి ప్రజల సమస్యల పై పోరాటం చేస్తామని
అన్నారు.
ప్రతిపక్షాన్ని సైతం గౌరవిస్తున్న నాయకుడు నాయిని రాజేందర్ రెడ్డి అని
అన్ని డివిజన్ లలో సమవుజ్జిగా నిధులను కేటాయిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్ మామిండ్ల రాజు, నెక్కొండ కవిత కిషన్, ఏనుగు మానస రామ్ ప్రసాద్,గుంటి రజిత్ శ్రీనివాస్ నాయకులు కుమార్ యాదవ్,భారత్ కుమార్,కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Latest