వరంగల్ మహా;
శ్రీ భద్రకాళీ శాకాంబరీ నవరాత్ర మహోత్సవాల సందర్భంగా నేడు అటవీ,పర్యావరణ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంత్రి కొండా సురేఖ కు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి కొండా సురేఖ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పూజించిన మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకు పోవాలని మంత్రి కొండా సురేఖ ప్రార్థించారు.
Post Views: 22








