Mahaa Daily Exclusive

  కేటీఆర్ ముందు మీ నాయిన నుండి ప్రతిపక్ష హోదా తెచ్చుకో ..ఎంపీ చామల ఫైర్..!

Share

హైదరాబాద్, మహా
కేసీఆర్ కుటుంబం మాయలో పడకుండా కృష్ణా జ‌లాల నుండి దక్షిణ తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కోసం తెలంగాణ ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం కొట్లాడాల‌ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 2 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేసిన కేసీఆర్ కేవ‌లం ఉత్త‌ర తెలంగాణాలోని కాళేశ్వ‌రం ప్రాజెక్టు కోసం ఖ‌ర్చు చేశార‌న్నారు. కానీ స‌గం ప‌నులు పూర్తి చేసిన జూరాల‌, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల‌ను ప‌ట్టించుకోలేద‌ని అన్నారు. ఆ ప్రాజెక్టుల‌పై ఐదారువేల కోట్లు ఖ‌ర్చు చేసినా కూడా ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీళ్లు వ‌చ్చేవ‌ని చెప్పారు.
కృష్ణా జ‌లాల‌ను కాపాడుకునేవాళ్లం అని అన్నారు. కేటీఆర్ కేవ‌లం ఎమ్మెల్యే అని ముఖ్య‌మంత్రిని ఛాలెంజ్ చేయాలి అంటే ప్ర‌తిప‌క్ష హోదా తెచ్చుకుని చేయాల‌న్నారు. ద‌మ్ముంటే కేసీఆర్ నుండి ప్ర‌తిపక్ష హోదా తెచ్చుకుని ఛాలెంజ్ చేయాల‌ని చెప్పారు. కేసీఆర్ వ‌య‌సులో పెద్ద‌వాడు కాబ‌ట్టి సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ కే వ‌చ్చి చ‌ర్చిద్దామ‌ని అంటున్నార‌ని తెలిపారు. కేటీఆర్ సీఎం అవుతాన‌ని ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని అన్నారు. ముఖ్య‌మంత్రిని స‌వాల్ చేసినంత మాత్రాన ముఖ్య‌మంత్రి అవ్వ‌ర‌ని విమ‌ర్శించారు.

Latest