హైదరాబాద్, మహా
తెలంగాణలో వరి అవసరం లేదని, అవసరానికి మించి ఎన్నో రెట్లు ఎక్కువ వరి ఇక్కడ పండిస్తున్నారని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరూ వరి లేక ఆకలితో చనిపోవడం లేదన్నారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాళేశ్వరం పని చేయకున్న తెలంగాణ వరి పంట పెరిగిందని, కేంద్రం యూరియా సబ్సిడీ ఇచ్చి వరి పంట కొనుగోలు చేస్తుందన్నారు. మనం పండించి తినేది వరి కాదని యూరియాతో పండించే వరి మాత్రమేనన్నారు. తెలంగాణలో 45 లక్షల టన్నుల వరి తింటామని పండించేది మాత్రం 2 కోట్ల టన్నులని, వరి కొనుగోలు పెంచాలని కేంద్ర మంత్రి నడ్డా ను సీఎం రేవంత్ కోరారని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న రోహింగ్యాలు, బంగ్లా దేశీయులను గుర్తించి వెనక్కి పంపాలని, అక్రమంగా 4 కోట్ల బంగ్లా దేశీయులు మన దేశంలోకి చొరబడ్డారని పేర్కొన్నారు. ఇందులో 20 లక్షల మంది వరకు తెలంగాణలో ఉంటారని, మోడీ ప్రభుత్వం వచ్చాక బోర్డర్ వ్యవస్థను పటిష్ట పరిచిందని గుర్తు చేశారు. గతంలో తాను కూడా హైడ్రా ను మెచ్చుకున్నానని, బిల్డర్స్ మేలు కోసం హైడ్రా తెచ్చారని, సల్కాం చెరువులో ఉన్న పాతిమ కాలేజీ ను కూల్చే దమ్ము ఈప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. పాతబస్తీ నేతలకు కాంగ్రెస్ లొంగిపోయిందని, హైడ్రా క్రెడిబిలిటీ కోల్పోయిందన్నారు. వికారాబాద్ లో లేక్ మధ్యలో ఇల్లు కట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి విరుద్ధంగా మాట్లాడే వారిని ఉపేక్షించేది లేదని, కొంత మంది మంచి తనంతో పార్టీకి నష్టం జరుగుతుందన్నారు.








