హన్మకొండ మహా;
కాజీపేట్ ఫాతిమా నగర్ లోని బాల వికాస భవనంలో మెప్మా ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరైయ్యారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటిశ్వరులను చెయ్యడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వం మహిళా సాధికారత కు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం మహిళా స్వయం ఉపాధి సంఘాలకు
రెండు కోట్ల నలభై లక్షలు చెక్కును ఎమ్మెల్యే నాయిని చేతుల మీదుగా వారికి అందజేశారు. ముఖ్యంగా
యూనియన్ బ్యాంకు వారు ముందుకొచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలకు సహకారం అందించి నందుకు వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పై, స్థానిక కార్పొరేటర్లు మానస రాంప్రసాద్, సర్తాజ్ బేగం , విజయ శ్రీ రజలి, యూనియన్ బ్యాంకు అధికారులు, మెప్మా అధికారులు, మహిళా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.








