Mahaa Daily Exclusive

  ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం పార్టీలకు అతీతంగా డివిజన్ల కు నిధులు కేటాయిస్తున్నాం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని ..!

Share

హన్మకొండ మహా;

ప్రజా పాలనలో భాగంగా గెలిచిన నాటి నుంచి ప్రతి రోజు రెండు డివిజన్ లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నగర మేయర్ గుండు సుధారాణి తో కలిసి 4 వ డివిజన్ లోని జ్యోతి బసు నగర్ లో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ను, అక్షర కాలనీలో కాలనీ నుంచి ప్రధాన రోడ్డు వరకు రూ.49.90 లతో రోడ్డు నూతన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ..
ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం, మేము పనిచేస్తున్నామని అన్నారు.
జిడబ్ల్యూఎంసి, కుడా సహకారంతో అన్ని కాలనీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని
శంకుస్థాపన చేసిన అనతికాలంలోనే పనులు ప్రారంభిచేలా చిత్త శుద్ధితో పనిచేస్తున్నామని
కేవలం గడిచిన 18 నెలల్లో ఒక్క 4 వ డివిజన్ లలో 4.50 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు.
అన్ని డివిజన్ లలో మాపై నమ్మకంతో ఓటు వేశారని అభివృద్ధి లో పార్టీలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశ్యం తోనే డివిజన్ల కు నిధులను మంజూరు చేయడం జరుగుతుందని దీనిని ఆదారాలతో అన్ని మీడియా ముందు ఉంచుతామని చెప్పారు. గత బిఆర్ ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల కు పార్టీని చూసి నిధులు కేటాయించలేదని ఈ సందర్భంగా నాయిని గుర్తు చేశారు. నగర అభివృద్ధి పై
మాకు పూర్తి స్థాయిలో చిత్తశుద్ధి ఉందని ప్రతిపక్ష నేతలు కావాలంటే సూత్ర ప్రాయమైన సూచనలు , సలహాలు ఇవ్వండి కానీ ప్రతి అంశం పై రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్, బ్లాక్ అద్యక్షులు హనుమకొండ అంబేద్కర్ రాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు.

Latest