మందమర్రి, మహా : మందమర్రి మండలం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత కక్షలతో ఒక వ్యక్తిపై హత్య ప్రయత్నం… చేసిన ఘటనలో సోమవారం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి మంచిర్యాల న్యాయస్థానానికి తరలించినట్లు రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ స్పష్టం చేశారు.
ఎస్సై కథనం ప్రకారం…. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్త తిమ్మాపూర్ నివాసి దుర్గం వెంకటేష్ అనే వ్యక్తి, అదే గ్రామానికి చెందిన కొమ్మ సంతోష్ అను వ్యక్తితో గతంలో ట్రాక్టర్ల విషయంలో చాలా సార్లు గొడవలు పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని
ఆదివారం సంతోష్ తన భార్యతో కొత్త తిమ్మాపూర్ లోని పోషమ్మ గుడికి వచ్చినప్పుడు అతనితో గొడవపడి, బూతులు తిట్టి, నిన్ను ఈ రోజు ఎలాగైనా చంపుతానని హెచ్చరించినట్ల వివరించారు.
అందులో భాగంగా రాత్రి 10 గంటలకు సంతోష్ మొబైల్ కు వెంకటేష్ ఫోన్ చేసి ఇంటికి పిలిచినట్లు వెల్లడించారు.
ఈ క్రమంలో వెంకటేష్ ఇంటికి
కొమ్ము సంతోష్ వెళ్ళగానే వెంకటేష్ తండ్రి దుర్గం రాయపోశం ఒక కర్రతో సంతోష్ తల మీద కొట్టినట్లు చెప్పారు. ఆ మరుక్షణమే వెంకటేష్ కత్తితో సంతోష్ ను పొడవగా అతని కడుపులో, వీపులో, చేతులకు గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. ఈ దాడిలో బాగం పంచుకున్న భాగస్వామ్యులైన వెంకటేష్, తల్లి శారదను, తండ్రి రాయపోషంను అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసి, మంచిర్యాల న్యాయస్థానంలో హాజరు పరిచి రిమాండ్ కు తరలించామని పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.








