Mahaa Daily Exclusive

  54 మంది విద్యార్థులకు పుడ్ పాయిజన్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఘటన ..!

Share

మహా దేవరకొండ జులై 14

నల్గొండ జిల్లా దేవరకొండ ముదిగొండ లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 54 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు.

వివరాల ప్రకారం, ఆదివారం రాత్రి విద్యార్థులు భోజనం చేసిన తర్వాత కొద్దిసేపటికే కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో విద్యార్థులు బాధపడటం జరిగింది అన్నారు.
వెంటనే అప్రమత్తమై విద్యార్థులను సోమవారం ఉదయం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఆహారం కలుషితం కావడానికి గల కారణాలను తెలుసుకోవడానికి తనిఖీలు చేపట్టారు. విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రులను, స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

ఘటన వివరాలు

ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. మొదట కొద్దిమంది విద్యార్థులు మాత్రమే అస్వస్థతకు గురవగా, తెల్లవారేసరికి 50 దాటింది. వెంటనే అప్రమత్తమైన గిరిజన ఆశ్రమ పాఠశాల యాజమాన్యం విద్యార్థులను స్థానిక దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి 32 మంది విద్యార్థులకు తరలించడం జరిగింది. బొడ్డుపల్లి ఆసుపత్రికి 22 మందికి తరలించడం జరిగింది. విద్యార్థులు భోజనంలో పెట్టిన చికెన్, బొబ్బర్లు తిన్న తర్వాతే ఈ సమస్యలు మొదలయ్యాయని విద్యార్థులు చెబుతున్నారు. కొంతమంది విద్యార్థులు భోజనం మరియు నీళ్లు సమస్య లు ఉన్నాయి అని తెలియజేయడం జరిగింది. ఆసుపత్రిలో అస్వస్థతతో విద్యార్థులు
ప్రస్తుతం స్థానిక దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను చూసేందుకు వారి తల్లిదండ్రులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. తమ పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతూ కన్నీరుమున్నీరవుతున్నారు. వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

విద్యార్థి సంఘాల నాయకులు, అధికారుల సందర్శన

ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు ఆసుపత్రిని సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించి, వారికి అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం

ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఈ వసతి గృహంలో ఆహారం నాణ్యతపై ఫిర్యాదులు వచ్చాయని, అయినా యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. సరైన పరిశుభ్రత పాటించకపోవడం, పాడైపోయిన ఆహారాన్ని వడ్డించడం వంటి కారణాల వల్లే ఈ పుడ్ పాయిజనింగ్ జరిగి ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు.

ఆస్పత్రిని,పాఠశాలను సందర్శించిన అధికారులు.. దేవరకొండ ఆర్టిఓ రమణ రెడ్డి, దేవరకొండ ఎమ్మార్వో మధుసూదన్ రెడ్డి, అగ్రికల్చర్ ఏడి ఆర్ శ్రీ లక్ష్మి స్పెషల్ ఆఫీసర్, దేవరకొండ ఎంపీడీవో డానియల్ , దేవరకొండ ఎస్ హెచ్ ఓ నర్సింహులు, ఎస్సై నారాయణరెడ్డి, సిబ్బంది ఇతర అధికారులు ఉన్నారు .?

Latest