Mahaa Daily Exclusive

  మహిళలు స్వయం సంపాదనతో ఎదగాలి మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
మైనార్టీ మహిళలకు ఎమ్మెల్యే రంగారెడ్డి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, నాలుగు మున్సిపాలిటీలకు చెందిన 203 మంది మైనార్టీ మహిళలకు స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్ల కొత్వాలుతో కలిసి కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… నియోజకవర్గంలోని మైనార్టీ మహిళలకు, ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా కుట్టు మిషన్లు అందజేయడం జరిగిందన్నారు. స్వయం శక్తితో ఎదగాలని స్వయం సంపాదన ఉండాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళకు అనేక పథకాలను అందిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఇంటి అభివృద్ధిలో ఇల్లాలు తోడై ఆర్థికంగా బలపడినప్పుడు, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని తెలిపారు. సమాజంలో మహిళలు స్వయం ఉపాధితో ఎదగాలని ఎమ్మెల్యే అన్నారు. మహిళా సంఘాల ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలను సర్కారు అందిస్తుందని, అలాగే మహిళల ఉపాధి కొరకు కార్పొరేషన్ల ద్వారా నిధులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ చైర్మన్ మల్ రెడ్డి రామిరెడ్డి, ఇబ్రహీంపట్నం ఏఎంసి చైర్మన్ గురునాథ్ రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ నవీన్ రెడ్డి, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమిషనర్ అమరేందర్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్, ముత్యాల రాజశేఖర్ రావు, కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, మైనార్టీ నాయకులు, నియోజకవర్గం మైనార్టీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Latest