హన్మకొండ మహా;
హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్లు తగ్గడానికి ప్రజల్లో అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో పాటు అంగన్వాడీ టీచర్లు కూడా ముందు ఉండాలని హనుమకొండ డిఎంహెచ్ఓ
డాక్టర్ ఏ అప్పయ్య తెలిపారు.
తెలంగాణ రాష్ర్ట ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాలతో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, హనుమకొండ ఆద్వర్యంలో అంగన్వాడీ టీచర్ల సూపర్వైజర్ లకు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అడిష్ నల్ డిఎంహెచ్‌ఓ డాక్టర్. టి మదన్ మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ డాక్టర్ ఏ అప్పయ్య, జిల్లా సంక్షేమ అధికారి జే జయంతి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ సంధర్భంగా డాక్టర్ ఏ అప్పయ్య మాట్లాడుతూ హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్లు తగ్గడానికి ప్రజల్లో అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు అంగన్వాడీ టీచర్లు కూడా ముందు ఉండాలన్నారు. హెచ్‌ఐవిె గురించి గురువారం నిర్వహించిన శిక్షణా తరగతులలో నేర్చుకున్న అన్ని విషయాలను క్షేత్ర స్థాయి లో జరిగే అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించే సమావేశాలు, ఐకేపీ,మెప్మ సభ్యులతో, కిశోర బాలికలకు నిర్వహించే సమావేశాలలో తెలియ చేయాలన్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకోవాలని అలాగే గర్భిణీ స్త్రీలు 3 వ నెల మరియు 9 వ నెలలో హెచ్‌ఐవిం పరీక్ష తప్పని సరిగా చేసుకునేలా చూడాలన్నారు. హై రిస్క్ గ్రూప్ కు చెందిన వారిలో లైంగిక సంబoదిత వ్యాధులు, పునరుత్పత్తి అవయవాలకు వ్యాపించే వ్యాధులు గురించి అవగాహన కలిగించి వాటిని తగ్గించడానికి కృషి చేయాలన్నారు. హెచ్‌ఐవి తో బాధపడుతున్న వారి పట్ల వివక్షత తొలగించడానికి కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎహెచ్టీయు ఇన్స్పెక్టర్ జే శ్యామ్ సుందర్, డిఏపీసీయు మేనేజర్ స్వప్న మాధురి, జిల్లా మాస్ మీడియా అధికారి. వి. అశోక్ రెడ్డి, సిడిపీఓ లు విశ్వజ, స్వాతి, జిల్లా ఐసీటీసీ సూపర్ వైసర్ రామకృష్ణ, డిడిఎం కమలాకర్, డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ కొ ఆర్డినేటర్ తేజస్వి, సంపూర్ణ సురక్ష కేంద్రం, మొబైల్ టెస్టింగ్, ఆర్డీఎంఎం సిబ్బంది, ఐసిటీసీ కౌన్సిలర్ లు పాల్గొన్నారు.








