మిర్యాలగూడ మహా
రెడ్డికాలనీ బిఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను మిర్యాలగూడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహరెడ్డి భారీ కేకును కట్ చేసి బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు కేకు తినిపించి జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జగదీష్ రెడ్డి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా అకాంక్షిస్తున్నామని తెలిపారు. తెలంగాణా రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర చాల కిలకమైనదని మాజీ సీఎం కెసిఆర్ మార్గదర్శకంలో పనిచేస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..








