AP: బనకచర్ల ప్రాజెక్టు విషయంపై జనసేన ఎంపీ బాలశౌరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన బనకచర్ల పూర్తైతే రాష్ట్రానికి భారీగా లాభం కలుగుతుందన్నారు. ఇలాంటి ప్రాజెక్టులకు అడ్డు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విభజన హామీలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు చేరవేయాలని పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ కొనసాగించేందుకు కేంద్రాన్ని నిధులు మంజూరు చేయాలని కోరిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
Post Views: 29








