AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్లాంట్‌ను సందర్శించిన ఆయన అక్కడి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత సెప్టెంబర్ నుంచి ఉక్కు ఉత్పత్తిలో వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. సంస్థను నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకురావడం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.
Post Views: 41








