Mahaa Daily Exclusive

  మొక్కలు నాటిన వైరా ఎమ్మెల్యే ఘనంగా కారేపల్లి లో ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ జన్మదిన వేడుకలు..!

Share

కారేపల్లి, మహా : వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కారేపల్లి మండలంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు పలు కార్యక్రమాలను నిర్వహించారు. కారేపల్లి సంత అవరణం, కారేపల్లిలో దుగ్గినేని చంద్రశేఖర్‌ నూతనంగా ప్రారంభించిన వెంచర్‌ లో వైరా ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కారేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను జరిపారు. ఎమ్మెల్యే కేక్‌ కట్‌ చేయగా నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మేకల తండాలో బానోత్ రామ్మూర్తి నాయక్ ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌ పుట్టిన రోజు వేడుకను జరిపారు. ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్‌ కట్‌ చేసి గ్రామస్తులకు స్వీట్లు పంపిణి చేశారు. ఈకార్యక్రమంలో అధికారులు ఇన్చార్జి ఎంపీడీవో మల్లెల రవీందర్ ప్రసాద్, ఏపీవో కోటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేందర్ రావు, పంచాయతీ కార్యదర్శులు,
సోసైటీ చైర్మన్‌ దుగ్గినేని శ్రీనివాసరావు, పగడాల మంజుల, ప్రముఖ వ్యాపారవేత్త వాణిజ్య విభాగ జిల్లా ఉపాధ్యక్షులు సురేందర్ మనియర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తలారి చంద్రప్రకాష్,ఇమ్మడి తిరుపతిరావు, మేదరి టోనీ, అడ్డగోడ ఐలయ్య, భీముడు నాయక్,బానోతు దేవుల నాయక్ ,డాక్టర్‌ పర్సా పట్టాభి రామారావు,ఈశ్వరినందరాజ్‌, పెద్దబోయిన ఉమాశంకర్‌, పొలగాని శ్రీనివాస్, సంతోష్ నాయక్, కబీర్, భూక్య శ్రీకాంత్, భూక్య కుమార్, మేదరి రాజా,దేవదాయ శాఖ సిబ్బంది మూడ్ మోహన్ చౌహన్,
తరులు పాల్గొన్నారు.

Latest