Mahaa Daily Exclusive

  అదనపు కలెక్టర్ శ్రీజకు వినతి అందించిన ఆపతి రామారావు….!

Share

తల్లాడ, జులై 25 ( మహా):-
మండలంలో పలు సమస్యలను పరిష్కరించాలని బిజెపి జిల్లా నాయకులు ఆపతి వెంకట రామారావు శుక్రవారం తల్లాడకు వచ్చిన అదన కలెక్టర్ శ్రీజకు వినతిపత్రం అందించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, రైతులకు యూరియా, గ్రామాల్లో డ్రైనేజీలు తదితర సమస్యలను పరిష్కరించాలని వినతిలో పేర్కొన్నారు. అన్నారుగూడెంలో రహదారులన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గాదె కృష్ణారావు, మండల ప్రధాన కార్యదర్శి పెరిక కిరణ్ గౌడ్ ఉన్నారు.