Mahaa Daily Exclusive

  పాలిటెక్నిక్‌లో మిగిలిన సీట్లకు స్పాట్ కౌన్సెలింగ్. * నవంబర్ 11న కొత్తగూడెం పాలిటెక్నిక్‌లో నిర్వహణ…!

Share

కొత్తగూడెం, మహా.
కొత్తగూడెం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 11వ తేదీన స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ తెలిపారు.

పాలీసెట్-2025లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, పాలీసెట్ రాయకపోయిన వారు పదో తరగతి ఉత్తీర్ణులైతే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

స్పాట్ అడ్మిషన్ల కోసం ఈ నెల 5 నుండి 10వ తేదీ సాయంత్రం 4 గంటల లోగా కళాశాల కార్యాలయంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని సూచించారు. దరఖాస్తుతో పాటు అన్ని అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు జత చేయాలని తెలిపారు.

స్పాట్ కౌన్సెలింగ్‌లో ఎంపికైన విద్యార్థులు తప్పనిసరిగా ఒరిజినల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ)తో పాటు ఇతర ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి సమాచారం కోసం కళాశాల అధికారులను సంప్రదించవచ్చని సూచించారు.

Latest