హైదరాబాద్, మహా: బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, రామచందర్ రావు ముగ్గురు కలిసి నిరాహార దీక్ష చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం, ఇతర అంశాలపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రిజర్వేషన్ ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే బీజేపీ ఎప్పుడూ బీసీ రిజర్వేషన్ కోసం మాట్లాడలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట బీసీ ప్రజలకు చెపుతున్న మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో బీసీలు నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్, సమన్వయకర్తలు వట్టె జానయ్య యాదవ్, సంగెం సూర్యారావు, బందారపు నర్సయ్య గౌడ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 95








