Mahaa Daily Exclusive

  సైబర్ మోసాల ప‌ట్ల జాగ్ర‌త్త‌-జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ..!

Share

ఆసిఫాబాద్ మహా :

ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. సోషల్ మీడియా లేదా ఆన్‌లైన్ యాడ్స్‌లో అధిక లాభాలు, లాటరీ, గిఫ్ట్, పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో ఆకర్షించి మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దని హెచ్చరించారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సందేశాలకు స్పందించవద్దని, ముఖ్యంగా బ్యాంక్ ఖాతా వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిషేధించిన బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్, లోన్ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకుని యువత ఆత్మహత్యల వంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.లోన్ యాప్‌ల ద్వారా వేధింపులకు గురైతే వెంటనే 100 లేదా 1930 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.