Mahaa Daily Exclusive

  ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం..!

Share

TG: రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 12 అడుగుల ఎత్తులో విగ్రహం తయారీకి తాజాగా రోడ్లు, భవనాల శాఖ టెండర్లను పిలిచింది. ఈ నెల 22 వరకు బిడ్లను దాఖలు చేయడానికి గడువు ఉంది. ఒక్కో జిల్లాలో రూ.13 లక్షల చొప్పున.. 33 జిల్లాల్లో విగ్రహాలకు మొత్తం రూ.4 కోట్ల ఖర్చు కానుందని R&B అంచనా వేసింది. పాలీమర్ జీఎఫ్ఆర్సీ పద్ధతిలో విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.