హన్మకొండ మహా;
వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగుర వేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అధికారులు, సిబ్బంది, చిన్నారులకు స్వీట్లను అందజేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, సురేష్ కుమార్ తో పాటు ఏసీపీలు, ఆర్.ఐ లు, ఇన్స్ స్పెక్టర్లు, పరిపాలన విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
మడికొండ పోలీస్ శిక్షణ కేంద్రంలో
మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ పరిపాలన అదనపు డిసిపి రవి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగరేశారు. ఈ సందర్భంగా అధికారులకు సిబ్బందికి స్వీట్లు అందజేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రమణబాబు, ఆర్ ఐ ఉదయ భాస్కర్, రవికుమార్, మంగీలాల్ తోపాటు ఇండోర్ ఔట్డోర్ అధికారుల సిబ్బంది పాల్గొన్నారు.







