వరంగల్ మహా;
దేశ 79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకల్లో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా నగర కమిషనర్, మేయర్ చేతుల మీదుగా ఉత్తమ సేవలందించిన బల్దియా ఉద్యోగులకు, సిబ్బందికి, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధి పై తన ప్రసంగంలో కూలంకషంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వాన షమీం మసూద్ కార్పొరేటర్లు పల్లం పద్మ రవి, గుండు చందన పూర్ణచందర్, సురేష్ జోషి, బస్వ రాజు కుమారస్వామి, అరుణ విక్టర్, చింతాకుల అనిల్ కుమార్, నల్ల స్వరూప రాణి రెడ్డి, జన్ను షిభా రాణి, పోశాల పద్మ స్వామి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తదనంతరం
పబ్లిక్ గార్డెన్ లోని టౌన్ హాల్ లో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ కార్యక్రమం లో అదనపు కమిషనర్ జోనా, హెచ్ ఓ లు రమేష్ , లక్ష్మారెడ్డి ఈ ఈ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.







