భూపాలపల్లి, మహా:
ప్రజలు ఇచ్చిన శక్తి, సామర్థ్యాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని సంక్షోభం నుండి సంక్షేమం వైపు … విధ్వంసం నుండి వికాసం వైపు..
నడిపిస్తున్నామని రాష్ట్ర ట్రై కార్ ఛైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ తెలిపారు.
జిల్లా కేంద్రంలోని డా బిఆర్ అంబేడ్కర్ క్రీడా మైదానంలో జరిగిన
79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి గా విచ్చేసిన ఆయన పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ ఫ్రా న డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు. భారతి ద్వారా
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా 223 గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. ఈ సదస్సుల్లో 53 వేల 763 దరఖాస్తులు స్వీకరించి వచ్చిన ప్రతి ధరఖాస్తుకు నోటీసులు జారీ చేశాం. జిల్లాకు 3 వేల 512 ఇండ్లు మంజూరు కాగా, 2 వేల 324 ఇండ్లు గ్రౌండ్ అయ్యాయి. 922 ఇండ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉండగా ఇప్పటి వరకు 8 కోట్ల 28 లక్షలు చెల్లించాం. జిల్లాలో లక్షా 15 వేల 963 మంది రైతులకు 139 కోట్ల 54 లక్షల 73 వేల రూపాయలు పెట్టుబడి సాయం అందించాం. జిల్లాలో 29 వేల 683 మంది రైతులకు 299 కోట్ల 34 లక్షల 47 వేల రూపాయలు రుణ మాఫీ చేశాం. 72 వేల 188 మంది పట్టాదారు పాసు పుస్తకం కలిగిన రైతులకు రైతు బీమా నమోదు చేశాం. ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తూ రైతు బీమా అమలు చేస్తున్నాం. పండ్ల తోటల పెంపకానికి 3 వేల 3 ఎకరాలకు 3 కోట్ల 16 లక్షలు మంజూరు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు ఒక వేయి 9 ఎకరాలకు 506 మంది రైతులను ఎంపిక చేశాం. ఆయిల్ పామ్ పథకానికి 2 వేల 500 ఎకరాలు లక్ష్యం కాగా, 243 ఎకరాల్లోని 89 మంది రైతులు సాగు చేపట్టారు. పేద ప్రజల ఆహార భద్రతకు 277 చౌక దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో మొత్తం లక్షా 25 వేల 589 రేషన్ కార్డులు ద్వారా 3 లక్షల 65 వేల 10 మంది కుటుంబ సభ్యులు నమోదయ్యారు. వీరికి ప్రతి నెలా 2 వేల 365 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నాం.
5 మండలాల్లో ఇందిరా మహిళా శక్తి కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టిస్తున్నాం. దీని ద్వారా మహిళా సంఘాలకు 13 లక్షల 47 వేల 450 రూపాయలు ఆదాయం సమకూరింది.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అటవీ అధికారి నవీన్ రెడ్డి,
అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటన్ సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,
ఆర్డీవో రవి, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ప్రజలు, విద్యార్ధిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.







