మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవపూర్ ఓరియంట్ సిమెంట్ పరిశ్రమ గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా వేస్తూ కార్మికశాఖ అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు అనుగుణంగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.9 మంది ఓట్లను తొలగించిన నేపథ్యంలో అభ్యంతరాలు రావడంతో పరిశీలించేందుకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. 26వ తేదీ వరకు సమావేశం నిర్వహించి, నిర్ణయం తీసుకునేందుకు ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే ఈ పరిశ్రమలో ఎన్నికలు ఆగస్టు 19న నిర్వహించవలసి ఉంది. ఈ ఎన్నికలు కాస్త నిలుపుదలకు ఉత్తర్వులు రావడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Post Views: 51







