AP: మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఉచిత బస్సు ప్రయాణంలో ఆంక్షలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్త్రీ శక్తి పేరుతో కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేసిందన్నారు. 16 రకాల బస్సులు ఉన్నాయని, కానీ 5 రకాల బస్సుల్లోనే ఈ పథకం అమలు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు సర్కార్ కోతల ప్రభుత్వమని మరోసారి నిరూపించిందన్నారు. మహిళలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
Post Views: 37






