AP: మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. సోమవారం కేంద్ర మంత్రులతో మంత్రి లోకేశ్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సెమీ కండక్టర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలపనున్నారు. అలాగే రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, సోనోవాల్, హర్దీప్ సింగ్‌లతో చర్చలు జరపనున్నారు.
Post Views: 82






