Mahaa Daily Exclusive

  చల్లంగా చూడు పోచమ్మతల్లి ….పోతురాజు విన్యాసాలతో కుర్రకారు చిందులు ….ప్రత్యేక ఆకర్షణగా పోతురాజుల విన్యాసాలు ఆటాపాటలు…!

Share

ఆమనగల్లు, మహా:
చల్లంగా చూడు పోచమ్మతల్లి అంటూ మహిళలు బోనాలతో అమ్మవారిని దర్శించుకోవడంతో కడ్తాల్ పట్టణం పోచమ్మతల్లి బోనాలతో పులకించిపోయింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా బోనాల సంబురాలు అంబరాన్ని అంటాయి. పోతురాజు విన్యాసాలతో కుర్రకారు చిందులేశారు. భాజాభజంత్రీలతో బోనాలు ఊరేగింపు నిర్వహించారు. తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా సోమవారం కడ్తాల్ పట్టణంలో పోచమ్మతల్లి బోనాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.పట్టణవాసులు. భక్తుల సందడితో పోచమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. డప్పు చప్పుళ్లతో భారీ ఎత్తున బోనాల ఊరేగింపు నిర్వహిం చారు. పోచమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మ వారికి బోనం కుండలో తీసుకువచ్చిన ప్రసాదాన్ని మహిళలు , యువతులు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కలుచెల్లించుకున్నారు.పోతురాజుల విన్యాసాలు, ఆటాపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.వేడుకల్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అమ్మవారికి సమర్పించే తొట్టెలతో బోనాల ఉత్సావం అంగరంగవైభవంగా సాగింది…
ఆమనగల్లులో…..
పోచమ్మ బోనాలు
ఆమనగల్లు పట్టణ కేంద్రంలో మాల కుల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బోనం కుండలను అలకరించి మహిళలు నూతన వస్త్రాలు ధరించిన భవనం పెట్టుకొని మధ్య వారి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పోచమ్మ తల్లి బోనాలను ఆలయాల చేరుకుని నైవేద్యం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. వేడుకలలో కుల సంఘం నాయకులు కాలే మల్లయ్య, చెన్నకేశవులు, ఏనుముల్ల రమేష్, దేవేందర్, యాదగిరి, వడ్డెమోని శివకుమార్, కాలే శివ, ప్రకాష్, చెన్నకేశవులు, కుమార్, లండం శేఖర్, ప్రశాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.