ఆదిలాబాద్ మహా : తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ శాఖ , ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు జిల్లాలో పర్యటించనున్నారు. మంగళ, బుధవారాల్లో నిర్మల్ , ఆదిలాబాద్ , ఆసిఫాబాద్ జిల్లాలను సందర్శించనున్నారు. జిల్లాల్లోని వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. నేడు 19న ఉదయం 10:00 గంటలకు నిర్మల్ జిల్లాకు చేరుకుంటారు.ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు నిర్మల్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన అనంతరం ఐడిఓసీ నిర్మల్‌లో వరదలపై అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:00 గంటలకు నిర్మల్ నుండి ఆదిలాబాద్ జిల్లాకు బయలుదేరుతారు .మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 6:00 వరకు ఆదిలాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం వరదలపై సమీక్షా సమావేశం లో పాల్గొని సాయంత్రం 6:30 గంటలకు ఆదిలాబాద్ నుండి కుమ్రం భీం – ఆసిఫాబాద్ జిల్లా బయలుదేరుతారు. రాత్రి రెబ్బన మండలంలోని గోలేటి ఎసీసీఎల్ గెస్ట్ హౌజ్ లో బస చేసి ఉదయం 8-30కు అక్కడినుండి జిల్లాలోని వర్ష బీభత్పానికి దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శిస్తారు.మధ్యాహ్నం ఒంటి గంటకు ఐడీవోసీ సమావేశ మందిరంలో అధికారులతో వరదలపై సమీక్షించి మధ్యాహ్నం 2గంటలకు అక్కడినుండి హైదరాబాద్ కు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వెళతారు.








