మందమర్రి, మహా : మందమర్రి మండలం లేమూరు గుడిపల్లి, సండ్రోన్ పల్లి గ్రామాలలో కొత్త రేషన్ డీలర్ షాపులను మంజూరు చేయాలని కోరుతూ సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు సామాజికవేత్త వంజరి వెంకటేష్, రెడ్డి రాజుల సాయికిరణ్, కంది ప్రదీప్ కుమార్, బందేల కృష్ణ, అడిగి పుల్ల మురళి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలంలో ఉన్న
వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని లేమురు గుడిపెళ్లికి,
శంకర్ పల్లె గ్రామపంచాయతీ (సోండ్రోన్ పల్లె) లో నూతన రేషన్ డీలర్ (షాప్) కోటను మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఈ రెండు గ్రామాలకు రేషన్ కోట లేకపోవడంతో మూడు కిలోమీటర్ల దూరం ప్రజలు నడిచి వెళ్లి ప్రతి నెల బియ్యం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. గతంలో అధికారులు రేషన్ కోటలకు (షాపు) ప్రతిపాదనలు పంపించినప్పటికీ అవి నేటికి మంజూరు కాకపోవడంతో పేద ప్రజలు ఆటోలో డీలర్ షాపుకు వెళ్లి సరుకులు తీసుకోవలసి వస్తుందని వెల్లడించారు. ఈ గ్రామాలలో కొత్తగా వివాహం చేసుకున్న వారు కూడా కొత్త రేషన్ కార్డులు కావాలని దరఖాస్తులు చేసుకున్న దృశ్య ప్రస్తుతం మండలంలో కొత్త కార్డులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు.








