వరంగల్ మహా;
ఏఐసిటియు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ పక్షాన హనుమకొండ లేబర్ ఆఫీస్ ముందు ఎండి అక్బర్ ఖాన్ అధ్యక్షతన ధర్నా చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ఏఐసీటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి అధ్యక్షులు సుంచు జగదీశ్వర్ ఉపాధ్యక్షులు మాలోత్ సాగర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్మికుల సమస్యల పై మాట్లాడుతూ
నిజమైన భవన నిర్మాణ కార్మికులకు క్లెయిమ్స్ అమలు కావడం లేదన్నారు వెల్ఫేర్ బోర్డు పెండింగ్ క్లెయిమ్స్ ను వెంటనే పరిష్కరించాలని తక్షణమే లేబర్ కార్డు నమోదు కార్డు రెన్యూవల్ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని పెన్షన్ సౌకర్యం కల్పించాలని లేబర్ ఆఫీసు వెల్ఫేర్ బోర్డు అవినీతి అక్రమాలను అరికట్టాలని సందర్భంగా అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం డిస్టిక్ కమిషనర్ ఆఫ్ లేబర్ వరంగల్ వినిత కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బిల్లింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధూపాకి రాజు ఎండి రియాజ్ జలీల్ సద్దాం అజీర్ నోమార్ ఎస్ దాసు ప్రత్యూష గణిపాక ఓదెల్ గోవర్ధన్ రాజు టి రత్నం యాకయ్య తదితరులు పాల్గొన్నారు.








