Mahaa Daily Exclusive

  జనసేన ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు..!

Share

AP: జనసేన ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. పాదగయ పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పూజల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం మహిళలకు చీరలు, కుంకుమ కిట్లను పంపిణీ చేయనున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా 12 వేల మంది మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీరలు పంపించారు.

Latest