Mahaa Daily Exclusive

  క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సుల్తానా..!

Share

భారత మహిళా క్రికెటర్ గౌహర్ సుల్తానా క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు  ప్రకటించారు. కాగా 37 ఏళ్ల సుల్తానా 2008లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇప్పటివరకు 50 వన్డేలాడి 66 వికెట్లు, 37 టీ20లు ఆడి 29 వికెట్లు తీశారు. చివరిసారిగా ఆమె 2014లో పాకిస్థాన్‌తో జరిగిన టీ20లో ఆడారు.