Mahaa Daily Exclusive

  వైసీపీ నేత అంబటి మురళిని విచారించిన పోలీసులు..!

Share

AP: అమరావతిపై అసత్య ప్రచారం చేసిన కేసులో పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సుమారు గంటన్నరపాటు ఆయన్ను పోలీసులు విచారించారు. మొత్తం 8 ప్రశ్నలు అడగ్గా .. ఎక్కువ ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదని సమాధానం ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. మురళీకృష్ణ సమాధానాలను న్యాయస్థానానికి నివేదిక రూపంలో ఇస్తామని సీఐ వీరేంద్రబాబు చెప్పారు.

Latest