Mahaa Daily Exclusive

  రైతులకు పంట నష్టం పరిహారం చెల్లించాలి-సీపీయ

Share

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మహా : కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం జైత్‌పూర్ బోర్డ్ గ్రామంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అడా ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో వాగులో ప్రవహించిన నీరు పత్తి పంటలను ముంచెత్తింది. ఫలితంగా సుమారు 10 మంది రైతుల 30 ఎకరాల పత్తి పంట పూర్తిగా నాశనం అయింది. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ దోత్రే వెంకటేష్‌కు వినతిపత్రం సమర్పించారు. పంట నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎకరానికి కనీసం 50వేల రూపాయ‌ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.జిల్లా కలెక్టర్ ఈ అంశంపై సానుకూలంగా స్పందిస్తూ వ్యవసాయ అధికారులను వెంటనే సంఘటన స్థలానికి పంపించి, నీటమునిగిన పంట చేలు పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అనంతరం నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు గొడిసెల కార్తీక్, గెడం టీకానంద్ తదితరులు పాల్గొన్నారు.