జమిలి ఎన్నికల అంశంపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తరచుగా జరుగుతున్న ఎన్నికలతో దేశ ప్రజలు విసుగెత్తిపోతున్నారని, అందుకే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సముచిత నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఆంత్రప్రెన్యూర్స్ అండ్ ట్రేడర్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న గోయల్ మాట్లాడుతూ.. పలు ఎన్నికలు జరగడం వల్ల పాలనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.
Post Views: 85






