వరంగల్ మహా;
రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని వర్గాల మత పెద్దలతో మట్వాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు ఆధ్వర్యంలో ఆదివారం సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ముఖ్యంగా ఈ కార్యక్రమం మత సామరస్యాన్ని పెంపొందించడం కోసం, ట్రాఫిక్ నిబంధనలను అనుసరించి, అన్ని వర్గాల మత పెద్దలు ప్రజల సహకారాన్ని కోరేందుకు ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా మనమందరం శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని వరంగల్ అంతటా శాంతియుత వాతావరణంలో ఈ గణేష్ ఉత్సవాలతో పాటు ఇతర పండుగలను జరుపుకోవాలని కోరుకుంటూ గణేష్ ఉత్సవాలను సజావుగా నిర్వహించడంలో సమాజంలోని అన్ని వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించడంలో పోలీసు శాఖకు అన్ని వర్గాల మత పెద్దలు మద్దతు అందించాలని సీఐ కోరగా వారు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన ఈ సందర్భంగా అన్ని వర్గాల పెద్దలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మట్వాడ సబ్ ఇన్స్పెక్టర్లు లచ్చయ్య, సాంబయ్య, సబ్బాని శివ, శివకృష్ణ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







