వరంగల్ మహా;
వరంగల్ ఏనుమాముల వ్యవసాయం మార్కెట్ ఎదురుగా ఉన్న ముత్తిలింగం కల్లంలో
మున్నూరు కాపు వాణిజ్య విభాగం 11 వ వార్షికోత్సవం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులందరూ కలిసి గజ్జెల రామకృష్ణ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గజ్జెల రామకృష్ణ పూర్వీకులు తాత గజ్జెల పాపయ్య 1948 నుండి మార్కెట్లో ప్రముఖంగా రామకృష్ణ తండ్రి గజ్జెల రామనాథం గత 60 సంవత్సరాలుగా అడ్తి కాటన్, కోల్డ్ స్టోరేజ్ వ్యాపారం చేస్తున్నారు. వీరు గతంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కోల్డ్ స్టోరేజ్ అధ్యక్షునిగా కూడా పని చేసారు. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజ్ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి యువకులు మార్కెట్ వ్యాపార రంగంలో ముందుకు వచ్చి వ్యాపారం చేయడం అభినందనీయం అని హాజరైన సభ్యులు కొనియాడారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గజ్జెల రామకృష్ణ పూర్వీకులు మున్నూరు కాపు వాణిజ్య విభాగానికి ఎన్నో సేవలందించారని వారిని ఈ సందర్భంగా కొనియాడుతూ సభ్యులందరూ రామకృష్ణ కు అభినందనలు తెలిపారు.
రామకృష్ణ ప్రస్తుతం ఇప్పుడు వేసిన ఈ మొదటి అడుగుతో భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ
మున్నూరు కాపు వాణిజ్య విభాగం నూతన కమిటీ గా
గౌరవ అధ్యక్షుడు కంభంపాటి కుమారస్వామి, అధ్యక్షులుగా గజ్జెల రామకృష్ణ , ఉపాధ్యక్షులు బండి జనార్ధన్ , ప్రధాన కార్యదర్శి శంకేసి శ్రీనివాసమూర్తి, సహాయ కార్యదర్శి తోట కర్ణాకర్, కోశాధికారి అపరాధి సారంగపాణి , ముఖ్య సలహాదారులుగా పుప్పాల యుగంధర్ , కొత్త కిషోర్ కుమార్ , సామంతుల సాంబయ్య , గై రమేష్, తదితరులు పాల్గొన్నారు.







